నందమూరి తారకరత్న ఆరోగ్య అత్యంత విషమించి కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు తెలుస్తోంది. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నకు విదేశీ వైద్యులతో సైతం చికిత్స అందించారు. మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి తారకరత్న చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. టీడీపీ యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం రోజున జనవరి 27న నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు.
అయితే.. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు తారకరత్న. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించారు మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ, ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.