బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుది గొప్ప విజయమని ప్రశంసించారు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసిన స్పిన్నర్స్ ప్రదర్శన అద్భుతమని కేటీఆర్ కొనియాడారు. యవ ఆటగాడు కే శ్రీకర్ భరత్.. భారత రెండో ఇన్నింగ్స్లో రత్నమని కేటీఆర్ అభివర్ణించారు. అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగుల మైలురాయిని అందకున్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
కాగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో రెండో ఇన్నింగ్స్లో అసీస్ 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమిండియా లక్షాన్ని 4 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో 4 టెస్టుల సిరీస్ లో టీమిండియా 2–0తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ మార్చి1నుంచి ఇండోర్ లో స్టార్ట్ కానుంది.