Breaking : క్షమాపణలు చెప్పిన కౌశిక్‌రెడ్డి

-

గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ముందు కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై కి కూడా లేఖ ద్వారా క్షమాపణ చెబుతానని ప్రకటించారు. గవర్నర్‌ తమిళిసై పై అవమానకరమైన రీతిలో కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఆ వాఖ్యలను సుమోటోగా స్వీకరించి ఆయనకు కమిషన్ నోటీసులిచ్చింది. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ రోజు (మంగళవారం) జరిగే విచారణకు హాజరై, వివరణ ఇవ్వాలని కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కమిషన్ నోటీసులందుకున్న ఆయన ఈ రోజు ఢిల్లీలో మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. విచారణకు వచ్చిన కౌశిక్‌రెడ్డి క్షమాపణలు చెప్పడంతో కథ సుఖాంతమైంది.

Top Telugu తెలుగు News , Telugu News Headlines Today, Latest and Breaking  Telugu News, తెలుగు ముఖ్య వార్తలు | Andhrajyothy

ఆ మధ్య గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా తలబడ్డారు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్‌రెడ్డి… గవర్నర్‌పై వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లులపై గవర్నర్ వ్యహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఈటల రాజేందర్‌ సమాధానం చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.

Read more RELATED
Recommended to you

Latest news