ప్రజా తీర్పు కోసం అధికార త్యాగం.. సీఎం కేసీఆర్ డేర్ స్టెప్!

-

సీఎం కేసీఆర్.. అనితరసాధ్యుడు.. తెలంగాణ చిత్రపటాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ధీరుడు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో పాతాళంలో ఉన్న తెలంగాణను నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన యోధుడు. ఒకప్పుడు గుజరాత్ ను ఆదర్శంగా తీసుకున్న దేశం.. ఇప్పుడు తెలంగాణను ఆదర్శంగా తీసుకునేలా చేసిన అసాధ్యుడు. ప్రతిపక్షాల దుష్టబుద్ధిని, ఎత్తుగడను తిప్పికొట్టే సమర్థుడు ఇప్పుడు మరో సాహసం చేశారు.

ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని సాహసం అది. అది కూడా తన స్వార్థం కోసం కాకుండా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం. తన అధికారాన్ని తృణప్రాయంగా వదిలేశారు. ఇప్పుడే కాదు.. ఇదివకు తెలంగాణ కోసం ఎన్నో సార్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ తమ పదవులకు రాజీనామా చేసి పదవుల మీద తమకు ఏమాత్రం వ్యామోహం లేదని నిరూపించారు. ఇప్పుడు అధికారం చేతుల్లో ఉన్నా.. ఇంకా 9 నెలలు పాలించే అవకాశం ఉన్నా సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఏ పార్టీ అయినా పదవి కోసం ఎన్నో కుయుక్తులకు పాల్పడుతుంటుంది. ఓటర్లను ఆకర్షిస్తుంటుంది. లేనిపోని హామీలను ఇస్తుంటుంది. అధికారం కోసం ఏది చేయాలో అది చేస్తుంది. కానీ.. సీఎం కేసీఆర్ అధికారాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజా తీర్పు కోసం ప్రభుత్వాన్ని రద్దు చేయడం నిజంగా హర్షనీయం. కేసీఆర్ కు అధికార దాహం లేదు.. కేవలం తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఆయన అహర్నిషలు కృషి చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలోనే తెలంగాణ ఒక్కసారిగా పైకి ఎగబాకింది. ఎక్కడో పాతాళంలో ఉన్న తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు కేసీఆర్. 60 ఏళ్ల కాలంలో పాలించిన ఏ ప్రభుత్వానికీ ఇది చేతకాలేదు. గత పాలకులు తెలంగాణను దోచుకుతినడమే పరమావధిగా పాలన చేశారు. అందిన కాడికి దోచుకుతిన్నారు. తెలంగాణ నాయకులు కూడా ఆంధ్రా పాలకుల అడుగులకు మడుగులొత్తారు. దీంతో తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. శిథిలం అయిపోయింది. నాలుగేండ్ల ముందు తెలంగాణ ఎలా ఉండేదో తెలంగాణ సమాజానికి తెలుసు.. ఇప్పుడు ఎలా ఉందో కూడా వాళ్లకు తెలుసు. ప్రజల మీద పూర్తి విశ్వాసంతో.. ప్రతిపక్షాలకు సరైన బుద్ధి చెప్పి వాళ్ల నోరు మూయించడం కోసం కేసీఆర్ ఇంత సాహసానికి పూనుకోవడం గొప్ప విషయం. ఇలాంటి సీఎంలు చాలా అరుదుగా ఉంటారు. తెలంగాణకు అటువంటి సాహసి దొరకడం నిజంగా తెలంగాణ ప్రజల అదృష్టం. భవిష్యత్తులోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దూసుకెళ్లాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news