బెజవాడ తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి.. కీలక నేతలకూ హ్యాండ్ ఇచ్చిన అధినేత..

-

బాబుగారి దృష్టిలో మేం లేమా..? పార్టీకోసం కష్టపడి పనిచేసి, టిక్కెట్ ను కూడా త్యాగం చేస్తే.. తమకు నామినెటెడ్ పదవి ఎందుకు ఇవ్వలేదు.. రెండో జాబితాలోనైనా ఇస్తారా..? లేక మొండి చెయ్యి చూపిస్తారా..ఇవే అనుమానాలు బెజవాడ టీడీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.. తొలి జాబితా అనంతరం నేతలందరూ గప్ చుప్ అయ్యారు.. తొలిజాబితాలో పేరువస్తుందని భావించిన నేతలకు మొండి చెయ్యి చూపడంతో వారు ఒకింత అసంతృప్తిలో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి..

తొలిజాబితాలో విజయవాడ టీడీపీ నేతలకు చోటుదక్కలేదు.. పదవుల కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు.. తొలి జాబితాలోనే తమ పేరు ఉంటుందని నిన్నమొన్నటి వరకు చెప్పుకున్న నేతలందరూ తొలిజాబితా తర్వాత సైలెంట్ అయ్యారు.. టీడీపీకి బెజవాడ కీలకం.. ఇక్కడ ఉండేవారందరూ పార్టీకి సీనియర్ నేతలు, ముఖ్యులు కూడా..ఈ క్రమంలో వీరికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని అందరూ భావించారు.. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం ఈసారి లైట్ తీసుకుంది..

బెజవాడ రాజకీయం అనగానే మొదట మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్తో పాటు.. వంగవీటి రాధా గుర్తొస్తారు.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కోసం వీరందరూ కష్టపడి పనిచేశారు. కేసులు పెట్టించుకున్నారు.. ఆర్దికంగా కూడా చితికిపోయారు.. గత ఎన్నికల్లో టిక్కెట్లు దక్కకపోయినా.. అభ్యర్దుల గెలుపు కోసం పనిచేశారు.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని భావించిన నేతలకు చంద్రబాబు షాక్ ఇచ్చారని నేతలు చర్చించుకుంటున్నారు..

బుద్దావెంకన్న, వంగవీటి రాధా, మాజీ మంత్రి దేవినేని ఉమాలాంటి వారికి ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉండటంతో వారికి నామినెటెడ్ పదవి ఇవ్వలేదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.. మరోపక్క నాగుల్ మీరా, పట్టాభి లాంటి వాళ్లు రాష్ట స్థాయిపదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నా.. తొలి జాబితాలో వారికి రిస్తహస్తమే మిగిలింది.. దీంతో నేతలందరూ గత మూడు రోజుల నుంచి సైలెంట్ అయ్యారు.. ఎక్కడా పొలిటికల్ కామెంట్స్ కూడా చెయ్యడంలేదు.. మరికొందరు నేతలైతే.. రెండో జాబితాలోనైనా.. తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే కొందరు నేతలు లోకేష్ ను కోరారట.. రెండో లిస్ట్ లో విజయవాడ నేతలకు ప్రాధాన్యత ఉంటుందోలేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news