బాలుడు మరణిస్తే కుక్కలు ఆకలితో ఉన్నాయని చెప్పడం ఏంటి? – రేవంత్ రెడ్డి

-

హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు ప్రదీప్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీపీసీసీ రేవంత్ రెడ్డి స్పందించారు. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు చనిపోవడం అత్యంత బాధాకరమని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడు మరణిస్తే మేయర్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని, కుక్కలు ఆకలితో ఉన్నాయని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.

వీధి కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని వ్యాఖ్యానించారు. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారని మండిపడ్డారు. బాలుడి కుటుంబాన్ని ఆదుకోకుండా సారీ చెప్పి చేతులు దులిపేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదీప్ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ భూపాలపల్లి పర్యటనకు ముందే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news