ఇన్నేళ్లకు డ్యాన్స్ తో రెచ్చిపోయిన టాలివుడ్ జంట..వీడియో వైరల్..

-

తెలుగు ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలలో శివ బాలాజీ, మధుమిత జంట కూడా ఉంది..వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా కెరీర్‌ ప్రారంభించారు.ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా నటించి మెప్పించారు. ఓ కోలీవుడ్‌ లో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న శివ- మధుమిత.. మొదటిసారిగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి మనసులు కలిశాయి. ఆపై పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటైయ్యారు.. ఆ తర్వాత చిన్న చిన్న క్యారక్టర్లు చేస్తూ వస్తున్నారు..

ఇక మధు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తనకు సంబందించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.. తాజాగా మరో వీడియోను షేర్ చేశారు. అధికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. తాజాగా ఈ లవ్లీ కపుల్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప’ లోని స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’ పాటకు స్టెప్పులేశారు.ఈ సందర్భంగా దంపతులిద్దరూ స్టైలిష్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో ముస్తాబై ఎంతో హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. ఇదెక్కడ జరిగిందో క్లారిటీ లేదు కానీ ఓ పార్టీ ఈవెంట్‌లో వీరూ డ్యాన్స్‌ చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఆట సందీప్ కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాంగ్‌లో మధుమిత డ్రెస్సింగ్‌ స్టైల్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మధు ఇల్లు, పిల్లలు చూసుకుంటుంది.. వీరిద్దరూ యూట్యూబ్ ఛానెల్ ను కూడా రన్ చేస్తున్నారు.. వారికి సంబంధించి వీడియోలను, వంటలను, టూర్స్ మొదలైన వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.. అవి వైరల్ అవుతున్నాయి.. శివబాలాజీ బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి బాగానే ప్రైజ్ మనిని గెలుచుకున్నాడు.. ఇకపోతే ప్రస్తుతం శివబాలాజీ శాకుంతలం లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

https://www.instagram.com/reel/Co6t4dKg8xv/?igshid=YmMyMTA2M2Y= 

Read more RELATED
Recommended to you

Latest news