ఆదిలాబాద్​లో భారీగా గంజాయి పట్టివేత

-

ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి తరలిస్తున్న దాదాపు 9లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పోలీసులకు రెండు కార్లలో తరలిస్తున్న గంజాయి దొరికింది.

మావల వద్ద రెండు కార్లలో తరలిస్తున్న సరకును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ రెండు వాహనాల్లో 8 మంది ఉండగా నలుగురు పరారయ్యారని తెలిపారు. ఆంధ్రా -ఒడిశా సరిహద్దులోని సీలేరు నుంచి గంజాయి తీసుకొచ్చి మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పారిపోయిన మిగతావారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news