తెలంగాణ ప్రజలకు శుభవార్త. తెలంగాణ క్రమబద్ధీకరణ స్థలాల రిజిస్ట్రేషన్ ప్రారంభం అయింది. తాజాగా సర్క్యులర్ జారీ కాగా, నేటి నుంచే అమలులోకి రానుంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీవో నంబర్ 59 కింద దరఖాస్తులకు మోక్షం కల్పించిన ప్రభుత్వం… ఇప్పటివరకు దరఖాస్తులు 63,748 వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రంలో 45 వేల మంది అర్హులైన దరఖాస్తుదారులు ఉన్నట్లు గుర్తించారు. స్థలాన్ని బట్టి స్లాబులవారిగా ఫీజులను నిర్వహించిన ప్రభుత్వం.. మార్చి 21 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మొత్తంగా వెయ్యి కోట్ల ఆదాయంపై సర్కారు నజర్ వేసింది. త్వరితగతిన పోడు భూములకు పట్టాలు కూడా పంపిణీ చేయనుంది. పట్టాల పంపిణీతో ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అర్హులైన గిరిజనులకు పట్టలు పంపిణీ చేసినందుకు చర్యలు తీసుకోనున్నారు.