దివ్యాంగ విద్యార్థుల కు జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. గృహ ఆధారిత విద్య, రవాణా భత్యం చెల్లించేందుకు సమగ్ర శిక్ష ‘సహిత విద్య’ కింద రూ.5,29,95,000కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా, అటు ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 17న ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 14న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించడంతోపాటు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వనున్నారు.