తుమ్మలకు కొత్త సీటు.. కేసీఆర్ ప్లాన్ అదేనా?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి, బి‌ఆర్‌ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు సీటు విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు సీటు వస్తుందో లేదో క్లారిటీ లేదు. జిల్లా రాజకీయాల్లో సీనియా నేతగా ఉన్న తుమ్మల గతంలో టి‌డి‌పిలో మూడు దశాబ్దాల పాటు పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టి‌డి‌పిని వదిలి బి‌ఆర్‌ఎస్ లో చేరారు. దీంతో కే‌సి‌ఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు.

కానీ పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి గెలిచారు.. కే‌సి‌ఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఇక 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ తరుపున పాలేరు నుంచి పోటీ చేసి తుమ్మల ఓడిపోయారు. అదే రాజకీయంగా తుమ్మలకు ఎదురుదెబ్బ తగిలింది. తుమ్మల ఓడిపోవడం.. అటు కాంగ్రెస్ తరుపున పాలేరు నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. అక్కడ నుంచి తుమ్మలకు కష్టాలు మొదలయ్యాయి. పాలేరు సీటు విషయంలో ఇబ్బందులు వచ్చాయి. ఇప్పటికే కే‌సి‌ఆర్ సిట్టింగులు అందరికీ సీట్లు అని ప్రకటించారు.

tummala nageswara rao

దీంతో పాలేరులో ఉపేందర్ రెడ్డి బరిలో దిగితే తుమ్మల పరిస్తితి ఏంటి అనేది అర్ధం కాకుండా ఉంది. అసలు బి‌ఆర్‌ఎస్ లో ఆయనకు సీటు లేదని, దీంతో ఆయన బి‌జే‌పి లేదా కాంగ్రెస్ లోకి వెళ్లిపోతారని ప్రచారం వస్తుంది. కానీ జనవరిలో ఖమ్మం సభ తర్వాత సీన్ మారింది..తుమ్మలకు కే‌సి‌ఆర్ ప్రాధాన్యత పెంచారు. మళ్ళీ తుమ్మల ఖమ్మంలో దూకుడుగా పనిచేస్తున్నారు.

అయితే తుమ్మలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇస్తారా? లేదా? అనేది తెలియట్లేదు గాని.. కే‌సి‌ఆర్ మాత్రం తుమ్మలని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ పాలేరు కాకపోతే కొత్త సీటు ఇస్తారా? లేదా నెక్స్ట్ గెలిచి అధికారంలోకి వస్తే తుమ్మలకు ఎమ్మెల్సీ ఇచ్చి , మంత్రివర్గంలో తీసుకుంటామని హామీ ఇస్తారా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news