తెలంగాణలో విద్యార్థులకు అలర్ట్‌.. లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల

-

విద్యార్థులకు గమనిక.. తెలంగాణలో లాసెట్, పీజీఎల్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది విద్యాశాఖ. మార్చి 1న లాసెట్, పీజీ లాసెట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 600గా దరఖాస్తు ఫీజు నిర్ధారించారు. రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ. 1000తో ఏప్రిల్ 19 వరకు, రూ. 2000తో ఏప్రిల్ 26 వరకు, రూ. 4వేలతో మే 3వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 5 నుంచి 10వ తేదీ వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

మే 16 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 25న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ లా సెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 25న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ లాసెట్ ప్రవేశ పరీక్షను ఆన్ లైన్లో నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం https://lawcet.tsche.ac.in/ సంప్రదించవచ్చు.

మరోవైపు.. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈ-సెట్ 2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1వ తేదీన టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్, ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్ సంయుక్తంగా విడుదల చేశారు.మార్చి 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ. 500 ఆలస్య రుసుముతో మే 8వ తేదీ వరకు, రూ. 2500తో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి 12వ తేదీ వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news