చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏమైనా అనారోగ్య సమస్యలను లైట్ తీసుకోవడం మంచిది కాదు. సమస్య చిన్నదైనా పెద్దదైనా సరే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం తగిన పద్ధతుల్ని అనుసరించడం మంచిది. ఎక్కువ మంది ఇబ్బంది పడే వాటిలో ఐరన్ లోపం కూడా ఒకటి. ఐరన్ లోపంతో చాలా మంది సతమతమవుతున్నారు.
మహిళలు ఎక్కువగా ఐరన్ లోపానికి గురవుతూ ఉంటారు. ఐరన్ లోపాన్ని అధిగమించే డ్రింక్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిని కనుక మీరు తీసుకుంటే కచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది ఐరన్ లోపం నుండి బయటపడవచ్చు. మన శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉండడం ఎంతో ముఖ్యం. దీని వలన ఆక్సిజన్ లంగ్స్ ద్వారా బాడీకి వెళ్తాయి. అలానే కార్బన్ డయాక్సైడ్ వదలడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఐరన్ లోపిస్తే రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ కారణంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు నీరసంగా ఉండడం వంటివి ఎదురవుతాయి. ఇలాంటి బాధలు ఉండకూడదు అంటే ఈ జ్యూసెస్ ని తప్పక తీసుకోండి.
నేరేడు పండ్లు:
నేరేడు పండ్లని తీసుకుంటే ఐరన్ ఎక్కువ అందుతుంది. దాదాపు 17% ఇందులో ఉంటుంది.
బీట్రూట్ జ్యూస్:
ఇది కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. రక్తం పెరగడమే కాకుండా సమస్యల నుండి కూడా బయటపడడానికి అవుతుంది.
బచ్చలి:
బచ్చలి కూడా ఐరన్ ని పొందడానికి సహాయపడుతుంది. అలానే గుమ్మడి కాయ కూడా ఐరన్ లోపం నుండి బయట పడేస్తుంది. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ ఐరన్ ఇందులో ఉంటాయి.
పైనాపిల్ జ్యూస్:
పైనాపిల్ జ్యూస్ లో విటమిన్ సి ఉంటుంది ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలానే దోసకాయ నిమ్మకాయ కొత్తిమీర బచ్చలి కూర ఇవన్నీ కలిపి కూడా మీరు జ్యూస్ చేసుకుని తాగొచ్చు.
ఖర్జూరం:
దానిమ్మ, ఖర్జూరం ని కూడా మిక్స్ చేసుకుని మీరు తీసుకోవచ్చు ఇలా వీటితో చక్కటి లాభాలని పొందొచ్చు.