ఎన్టీఆర్ వల్లే కాలేదు.. జగన్ వల్ల అవుతుందా..? ఐతే మంచిదే..!

-

ఇటీవల జగన్ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.. అదేమిటంటే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు.. ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేయకూడదు.. నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం.. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు కార్పొరేట్ ఆసుపత్రులు విసిరే అదనపు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులనుతాము పనిచేసే కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చి కలవాలనిఇక్కడ సౌకర్యాలుమిషన్లు లేవని చెబుతున్నారుఎందుకంటే.. కార్పొరేట్ ఆసుపత్రులు టార్గెట్లు పెట్టి వారికి ఇన్సెంటివులు ఇస్తుంటాయి కాబట్టిఈసీజీసిటి స్కానింగ్టిఎంటి వంటి పరీక్షలన్నీ బయట ప్రైవేటు సెంటర్లకు కమిషన్ల కోసం రాస్తుంటారు.

అందుకే.. నామ్ కే వాస్తే.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటూ.. కార్పొరేటు ఆసుపత్రులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారుఈ అరాచకాలకు తెరదించేందుకు జగన్ సర్కారు ప్రైవేటు ప్రాక్టీసు నిషేధించడం అభినందనీయమేఅయితేఇది ఎంతకాలం కొనసాగుతుందన్నదే చూడాలిఎందుకంటే.. గతంలో ఎన్టీఆర్ కూడా ఇలాగే ప్రభుత్వ వైద్యులుప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించారుకానీ దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయలేకపోయారుమరి ఈసారి జగన్ అయినా.. వీరిని కట్టడి చేసేందుకు తగిన నిబంధనలుయంత్రాంగం ఏర్పాటు చేస్తారా అన్నది వేచి చూడాలి.

వీటితో పాటు జగన్.. ప్రతి మండలానికి కనీసం 50 పడకల ఆసుపత్రిఅన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలుఈసీజీసిటి స్కానర్లు ఏర్పాటు చేస్తే బావుంటుందిఆరోగ్యశ్రీ కింద మరికొన్ని డజన్ల రోగాలను అదనంగా అందించడంతోపాటుఆపరేషన్ చేయించుకున్న రోగి తిరిగి కోలుకునేవరకూ నెలకు వేలు ఇవ్వాలన్న నిర్ణయం కూడా మెచ్చుకోదగిందేపనిలోపనిగా ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపైనా జగన్ దృష్టి సారిస్తే మంచిదికార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలకు కళ్లెం వేస్తే జనం జగన్ కు జేజేలు కొడతారు.

Read more RELATED
Recommended to you

Latest news