రూ.1,200 పొదుపుతో… రూ.15 లక్షల రిటర్న్స్… వివరాలు ఇవే..!

-

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి వివిధ రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల తో చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. వేర్వేరు వర్గాలకు పలు రకాల ఇన్స్యూరెన్స్ పాలసీలను LIC అందిస్తోంది. కొన్ని ప్లాన్స్‌ లో ఎక్కువగా రిటర్న్స్ వస్తుంటాయి. కాబట్టి ఎక్కువమంది ఎల్ఐసీ పాలసీలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

LIC అందిస్తున్న వాటిల్లో జీవన్ ఉమాంగ్ పాలసీ కూడా ఒకటి. సమగ్ర జీవిత కవరేజీని, మంచి రిటర్న్స్‌ని అందించే ప్లాన్ ఇది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. జీవన్ ఉమాంగ్ పాలసీ లో మెచ్యూరిటీ తర్వాత కూడా బెనిఫిట్స్ లభిస్తాయి. దీన్నే సర్వైవల్ బెనిఫిట్స్ అని పిలుస్తారు. మెచ్యూరిటీ వరకు ప్రీమియం డబ్బులు పే చెయ్యాలి.

ఈ పాలసీని కనీసం రూ.2,00,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌ తో తీసుకోవచ్చు. గరిష్టంగా ఎంత అయినా కూడా ఎంచుకోవచ్చు. ప్రీమియం చెల్లించే టర్మ్ 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లుగా వుంది. 100 నుంచి మీ వయస్సు తీసేయండి. అప్పుడు ఎన్నేళ్లు వస్తుందో అదే పాలసీ టర్మ్. 35 ఏళ్ల వయస్సులో పాలసీ ని తీసుకుంటే పాలసీ టర్మ్ 65 ఏళ్లుగా ఉంటుంది.

చివరి ప్రీమియం చెల్లించిన తర్వాత సర్వైవల్ బెనిఫిట్స్ ని మీరు పొందొచ్చు. 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 30 ఏళ్లు ప్రీమియం చెల్లించేలా రూ.5,00,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకుంటే ఏటా రూ.14,758 ప్రీమియం కట్టాలి. 30 ఏళ్లు పూర్తిగా ప్రీమియం చెల్లించిన తర్వాత ప్రతీ ఏటా రూ.40,000 లభిస్తాయి. రూ.5,00,000 + సుమారు రూ.10 లక్షల పైనే మీకు బోనస్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news