ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారనే అనుమానం కలుగుతుందని ఆరోపించారు బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. మద్యం పాలసీ ఎల్లలు దాటి పంజాబ్, ఢిల్లీ వరకు చేరిందని.. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిజాయితీపరులైతే విచారణలో నిరూపించుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రంలోని ఓటుకు నోటు కేసు, డ్రగ్స్ కేసులు ఏమయ్యాయని.. విచారణ ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నించారు లక్ష్మణ్. కవిత తప్పు చేయకపోతే తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. కవితకు ఈడి నోటీసులు ఇస్తే.. తెలంగాణ సమాజాన్ని విచారణ జరుపుతున్నట్లు చిత్రీకరణ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని.. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బిజెపిని ఆదరిస్తున్నారని తెలిపారు.