లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలని ఉందా..? అయితే ఇవే పర్ఫెక్ట్…!

-

చాలా మంది రోడ్ ట్రిప్ లు వేయాలని అనుకుంటారు. ప్రేయసి తో కానీ భార్య తో కానీ రోడ్డు ట్రిప్ వేయడం చాలా బాగుంటుంది. పైగా అది మరిచిపో లేని జ్ఞాపకాలని మీకు అందిస్తుంది. మీరు కూడా మీ ప్రేయసి తో కానీ మీ భార్యతో కానీ ఏదైనా రోడ్డు ట్రిప్ వేయాలి అనుకుంటున్నారా అయితే ఇవే బెస్ట్ ప్లేసెస్ మరి చూసేయండి.

శ్రీనగర్ నుండి మనాలి:

శ్రీనగర్ నుండి మనాలి రోడ్డు ప్రయాణం చాలా బాగుంటుంది. ఈ డ్రైవ్ ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది సందేహమే లేదు. ఈ భూమిమీదే అత్యంత అందమైన ప్రయాణం ఇది. సుమారు 850 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్పితి వ్యాలీ, లేహ్, లద్ధాఖ్, కార్గిల్ వంటివి దారిలో చూడచ్చు.

గోవా నుండి కూర్గ్:

ఇది కూడా చాలా నచ్చుతుంది అందరికీ. 470 కిలోమీటర్ల దూరం ఇది. నాన్‌స్టాప్‌గా డ్రైవ్‌ చేస్తే 12 గంటల సమయం పడుతుంది. గోకర్ణ, ఉడుపి, మంగళూరు వంటి పర్యాటక ప్రదేశాలను చూడచ్చు.

దిల్లీ నుండి జైసల్మేర్:

దిల్లీ నుండి జైసల్మేర్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఎడారి ప్రాంతంలో ఉంటుంది. 780 కిలోమీటర్ల ఈ ప్రయాణం సుమారు 15 గంటల పాటు ఉంటుంది. ఎంచక్కా ఎంజాయ్ చేసేయచ్చు.

ముంబయి నుండి మహాబలేశ్వర్:

అద్భుతమైన రోడ్డు ప్రయాణం ఇది కూడా. సుమారు 250 కిలోమీటర్ల ప్రయాణం ఇది.
మార్గ మధ్యం లో లోనావాలా, ఖందాలా వంటివి కవర్ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news