రాజకీయాలలోకి రావద్దని రజనీకాంత్ కి చెప్పా – వెంకయ్య నాయుడు

-

రాజకీయాల్లోకి రావద్దని గతంలోనే తాను రజినీకాంత్ కి సూచించినట్లు తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ లో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి పాల్గొన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2020లో రజనీకాంత్ అనారోగ్యం బారిన పడినప్పుడు ఫోన్ చేసి రాజకీయాల్లోకి రావద్దని సలహా ఇచ్చానని.. పాలిటిక్స్ అంత మంచివి కావని, ఆరోగ్యంగా ఉండాలంటే పాలిటిక్స్ కు దూరంగా ఉండాలని సూచించానని వెల్లడించారు. అయితే రాజకీయాలలోకి వచ్చే యువతను తాను నిరుత్సాహపరచడం లేదని.. క్రమశిక్షణ, నిబద్ధత ఉంటే రావచ్చని పేర్కొన్నారు. అయితే తాను రాజకీయాలలోకి రావద్దు అని రజనీకాంత్ కి సూచించినప్పుడు ఆయన అపార్థం చేసుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news