BREAKING : సీఎం కేసీఆర్ కు పొత్తికడుపులో అల్సర్..

-

ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థకు గురై గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు . అక్కడ కేసీఆర్‌కు డాక్టర్స్ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. కేసీఆర్‌కు ఎండోస్కోపి, సిటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు.. ఆయనకు అల్సర్‌ ఉన్నట్టుగా తెలిపారు. సీఎం కేసీఆర్‌కు పొత్తి కడుపులో అసౌకర్యం ఏర్పడిందని వెల్లడించారు. కడుపు నొప్పితో సీఎం కేసీఆర్‌ వచ్చారని తెలిపారు. ఎండోస్కోపి, సిటీ స్కాన్ చేసినట్టుగా వెల్లడించారు వైద్యులు.

CM KCR | CM KCR is slightly unwell. Medical tests at Gachibowli AIG Hospital-Namasthe  Telangana

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈరోజు ఉదయం పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడింది అని తెలిసింది. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి కేసీఆర్‌కు పరీక్షలు చేపట్టారు . ఆ తర్వాత ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తీసుకురావడం జరిగింది. ఆస్పత్రిలో కేసీఆర్‌కు సీటీ, ఎండోస్కోపీ చేయడం జరిగింది . కడుపులో ఒక చిన్న అల్సర్ కనుగొనబడింది.కానీ దీనికి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని తెలిపారు వైద్యులు. అది మందులతో తగ్గిపోతుంది. ఆయన మిగిలిన అన్ని పారామిటర్స్ సాధారణంగా ఉన్నాయి. తగిన మెడికేషన్ ఇవ్వడం కూడా ప్రారంభించబడింది’’ అని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news