విద్య నేర్పే గురువులు కూడా అమ్ముడుపోవడం దురదృష్టకరం : ఎంపీ రఘురామ

-

వైసీపీ, ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించిందని ప్రతిపక్ష పార్టి ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. చదువు రాని వారితో కూడా ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు ఎంపీ రఘురాం. మా వాళ్లు దోచుకున్నారని, అందుకే ఓటుకు రూ. 5 వేలు ఇస్తున్నారని అన్నారు. వైజాగ్ లో ఒక మహిళా మంత్రి ఆధ్వర్యంలో ఓటుకు రూ. 5 వేలు ఇచ్చారని తెలిపారు.
విద్య నేర్పే గురువులు కూడా అమ్ముడుపోవడం దురదృష్టకరమని అన్నారు రఘురాం. తమ ప్రభుత్వం సక్రమంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని… అలాంటప్పుడు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఎలాగని అడిగారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపిందని, ఒకవేళ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తే, ఈ కేసులో ఇంకా ఎవరు మిగిలారనేది చూడాలని అన్నారు రఘురాం.

ఈ నేపధ్యం లో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎంపీ రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.రఘురామ ఢిల్లీ దాటి బయటికి రాలేడని, మీడియా వాళ్లను కూర్చోబెట్టుకుని ఏదేదో వాగుతుంటాడని మండిపడ్డారు. నియోజకవర్గం సరే, ఏపీలోనూ, కనీసం హైదరాబాదులోనూ అడుగుపెట్టలేని అజ్ఞాతవాసి అని అన్నారు. గూగుల్ సెర్చ్ లో అరిటాకు అని వెదికితే రఘురామ గురించే వస్తుందని, ఆయనొక కమెడియన్ అని రఘురాం ని అన్నారు. రఘురాం ఏవైనా సినిమాల్లో నటిస్తే కనీసం డబ్బులు అయినా వస్తాయని అన్నారు. రఘురామకు పెద్దగా మేకప్ కూడా వేయాల్సిన అవసరం లేదని, మామూలుగానే బఫూన్ లాగా ఉంటాడని కామెంట్లు చేసారు. మహాభారతంలో శిఖండికి, ఆయనకు పెద్ద తేడా లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news