TSPSC పేపర్ లీక్.. విచారణలో కీలక విషయాలు

-

పేపర్ లీక్ ఘటనలకు సంబంధించి.. కమిషన్ ఆఫీసులో విచారించిన సిట్ కీలక విషయాలు రాబట్టింది. సిస్టమ్ ఆడ్మిన్ రాజశేఖర్ రెడ్డి సాయంతో సెక్షన్ ఆఫీసర్ లక్ష్మి కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రాలు చోరీ చేసిన ప్రవీణ్ పెన్ఎవ్లోకి AE పేపర్స్ కాపీ చేసుకున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వాటిని రేణుక, ఆమె భర్తకు అమ్మిన ప్రవీణ్.. రేణుక ఇచ్చిన రూ.10లక్షల్లో రూ.3.5లక్షలను తన బాబాయ్ ఖాతాకు బదిలీ చేసినట్లు తేల్చారు.

ఇదిలా ఉంటే.. ప్రధాన నిందితుడు ప్రవీణ్ విషయంలో రోజుకొక కొత్తకోణం వెలుగులోకి వస్తుంది. అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ వీడియోలు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 46 మంది మహిళలతో ప్రవీణ్ న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. వీళ్లకి కూడా పేపర్ లీక్ చేసిట్లుగా పోలీసులు గుర్తించారు.

మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్ తో పాటు రేణుక సెలవుల విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్దారం ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా రేణుక వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది 12 సెలవులు పెట్టినట్లు గుర్తించారు.. ఈ నెల 4,5 తేదీల్లో తమ బంధువు మృతి చెందాడని సెలవు పెట్టింది.. ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు రేణుక సెలవులు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news