విశాఖ రాజధాని మంత్రం వైసీపీకి వర్కౌట్ కాలేదా? గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ యూజ్ కాలేదా? ఉత్తరాంధ్రపై వైసీపీకి ప్రేమ కాదు..అక్కడ రాజకీయంగా బలపడటానికే రాజధాని కాన్సెప్ట్ తెచ్చిందా? అంటే కాస్త అవుననే విధంగా ఉత్తరాంధ్ర ప్రజల నుంచి సమాధానం వస్తుంది. ఎన్ని చేసిన ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని నమ్మినట్లు కనిపించడం లేదు. ఆ విషయం తాజాగా వెలువడుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంలో తెలిసిపోతుంది.
ప్రస్తుతం వస్తున్న ఫలితాల్లో టిడిపి అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఈయన గెలుపు దాదాపు ఖాయమే అని తెలుస్తోంది. అయితే వైసీపీకి యాంటీగా ఫలితం రావడం షాకింగ్ ఉందనే చెప్పాలి, రాజధాని విశాఖ అని, త్వరలోనే అక్కడ నుంచి జగన్ పాలన మొదలవుతుందని వైసీపీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఆఖరికి జగన్ కూడా ఈ మధ్యే జులై నుంచి విశాఖ లో పాలన మొదలుపెడతానని అన్నారు. ఇవన్నీ వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. పట్టభద్రులు వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు.
అంటే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ప్రజలు వైసీపీని నమ్ముతున్నట్లు కనిపించడం లేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో టిడిపి ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో మూడు జిల్లాలో వైసీపీ హవా నడిచింది..కానీ ఇప్పుడు ఆధిక్యం మారిపోతుంది. టిడిపి లీడ్ లోకి వస్తుంది. లేటెస్ట్ గా వచ్చిన సర్వేల్లో కూడా అదే తేలింది.
విశాఖలో 15 సీట్లు ఉంటే టిడిపి 7 సీట్లు, వైసీపీ 5 సీట్లు గెలుచుకుంటుందని, 2 సీట్లలో టఫ్ ఫైట్ ఉందని తేలింది. శ్రీకాకుళంలో 10 సీట్లు ఉంటే టిడిపి 6, వైసీపీ 2, టఫ్ ఫైట్ 2 సీట్లలో ఉంది. విజయనగరం జిల్లాలో 9 సీట్లు ఉంటే టిడిపి 5, వైసీపీ 2 సీట్లు, టఫ్ ఫైట్ 2 సీట్లలో ఉంది. అంటే ఉత్తరాంధ్రలో టిడిపి లీడ్ లోకి వచ్చిందనే చెప్పవచ్చు.