ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. సీఆర్డీఏ కీలక ప్రకటన

-

సీఆర్డీఏ ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లపై కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు కూడా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్లాట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపింది సీఆర్డీఏ. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు కేటాయించినట్టు స్పష్టం చేసింది. ఎంఐజీ లే అవుట్ లో 200 చదరపు గజాల ప్లాట్లు 58 ఉన్నాయని తెలిపింది. 240 చదరపు గజాల ప్లాట్లు 188 ఉన్నాయని తెలిపింది. సీఆర్డీఏ తాజా ప్రకటన నేపథ్యంలో, జగనన్న లే అవుట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీతో ప్లాట్లు అందించనున్నారు.

CM YS Jagan Mohan Reddy to meet PM today

కాగా.. అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలను ఉద్దేశించిన దస్త్రానికి అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. పేదలకు స్థలాలు ఇచ్చే సీఆర్‌డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టాల సవరణకు గవర్నర్ అంగీకారం తెలిపారు. గతేడాది ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టాలకు జగన్ ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news