మరోసారి మోడీ భద్రత లోపం.. ప్రధాని వద్దకు దూసుకొచ్చిన యువకుడు

-

ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం ప్రధాని మోడీ కర్ణాటకలోని దేవనాగరి జిల్లాలో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. అయితే ఓ యువకుడు బారీకేడ్లను దాటుకుంటూ మోడీ కాన్వాయ్ మీదకు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకుని లాగిపారేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కొప్పాల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా ఆ యువకుడిని పోలీసులు గుర్తించారు. కాగా ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం కనబడటం ఇది రెండోసారి. గతేడాది హుబ్బలి జిల్లాలో పీఎం మోడీ పర్యటించినప్పుడు కూడా భద్రతాలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది.

PM Narendra Modi's Karnataka Visit: Full schedule | Zee Business

అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన పర్యటన సందర్భంగా చిక్కబళ్లాపూర్, బెంగుళూరు మరియు దావణగెరెలలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాదు బెంగుళూరు మెట్రో ఫేజ్ 2 యొక్క కొత్త సెక్షన్‌ను కూడా మోదీప్రారంభించారు. ఈ మెట్రోకొత్త లైన్‌ బెంగళూరు యొక్క మొదటి టెక్ కారిడార్ మెట్రో నెట్‌వర్క్‌కు అనుసంధానించబడింది.వైట్‌ఫీల్డ్ (కడుగోడి) స్టేషన్‌లో మెట్రో స్ట్రెచ్‌ను ప్రధాని ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు, మెట్రో కార్మికులతో కలిసి మోదీ కూడా మెట్రోలో ప్రయాణించారు.6 కోచ్‌లను కలిగి ఉన్న 5 రైళ్లతో ఈ మార్గం నడపబడుతుంది. మరో రెండు రైళ్లను బ్యాకప్‌గా ఉంచనున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) తెలిపింది. రైలు ఫ్రీక్వెన్సీ 12 నిమిషాలు ఉంటుంది . ఈ మార్గంలో గరిష్ట ఛార్జీ రూ. 35 ఉంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news