అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, మోదీ సర్కార్‌పై పోరు మొదలు పెట్టింది. మోదీ హఠావో దేశ్ బచావో పోస్టర్లతో ఢిల్లీలో కాషాయ సర్కార్‌కు వ్యతిరేకంగా పోస్టర్లతో ఆప్ దేశవ్యాప్తంగా తన క్యాంపెయిన్‌ను ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు మొత్తం వ్యతిరేకంగా 11 భాషల్లో దేశవ్యాప్తంగా పోస్టర్ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది ఆప్. ప్రధాని మోది విద్యార్హతలు ఉండాల్సిన అవసరం ఉందా అని దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆప్ ప్రశ్నించింది. పీయేతర ప్రభుత్వాలను మోదీ సర్కార్ తొక్కిపెడుతోందని ఆప్ సహా విపక్షాలు భగ్గుమంటున్నాయి.
కాగా, మోదీ సర్కార్ లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమాఖ్య వ్యవస్ధకు బీజేపీ తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. టీఎంసీ ఆధ్వర్యంలో కోల్‌కతాలో చేపట్టిన నిరసన దీక్షలో దీదీ, మోదీ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీయేతర రాష్ట్రాలను కాషాయ పాలకులు ఎదగకుండా చేస్తున్నారని అన్నారు ఆమె.మన జీఎస్టీ సొమ్మును కేంద్ర పాలకులు లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మమతా. వందరోజుల పని డబ్బును కూడా వారు నిలుపుదల చేస్తున్నారని మండిపడ్డారు.