డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు మొదలు.. ఎన్నో సమస్యలు ఆలివ్ ఆకుల పొడి తో దూరం..!

-

చాలా మంది ఇళ్లల్లో ఆలివ్ ఆయిల్ ని ఉపయోగిస్తారు. ఆలివ్ చాలా మంచిది. ఆలివ్ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆలివ్ ఆయిల్ లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు కూడా ఉంటాయి. ఆలివ్ ఆకుల వలన కూడా చాలా లాభాలు ఉంటాయి ఆలివ్ ఆకులని ఉపయోగించి చాలా రకాల సమస్యల నుండి బయట పడొచ్చు.

డయాబెటిస్ మొదలు హై బీపీ దాకా చాలా సమస్యలను ఇది దూరం చేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ కి సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నట్లయితే ఆలివ్ ఆకుల పొడిని తేనె లో కలిపి తీసుకుంటే ఆ సమస్య నుండి బయటపడొచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఒంట్లో ఉండే గ్లూకోస్ ని కూడా తగ్గించుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.

గుండెకి సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదం నుండి బయట పడేస్తుంది. ఆలివ్ ఆకుల పొడి ఆర్థరైటిస్ వారికీ మంచిదే. ఈ సమస్య తో బాధపడే వాళ్ళకి ఆలివ్ ఆకుల పొడి బాగా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆకుల పొడిని తీసుకుంటే యూరిక్ యాసిడ్ ఒంట్లో ఉండదు. నొప్పులు కూడా దూరం అవుతాయి.

ఆలివ్ ఆకుల పొడిని ఎలా తయారు చేసుకోవాలి..?

ఆలీవ్ ఆకులకు తీసుకుని శుభ్రం చేసి… ఎండ లో ఆరపెట్టి వాటిని మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఈ ఆకులు పొడి ని మీరు స్మూతీలలో జ్యూస్ లో లేదంటే హెర్బల్ టీ వంటి వాటిని కూడా తయారు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news