ప్రెగ్నెన్సీ రాకుండానే.. కొంతమంది ఆడవాళ్లు పెగ్నెన్సీ ఫీల్ అవుతారు. దీన్నే ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటారు.. ఇదే పరిస్థితిని కుక్కలు కూడా ఫీల్ అవుతాయట.. గర్భందాల్చకుండానే..గర్భందాల్చిన లక్షణాలు ఉంటాయట. కానీ కడుపులో మాత్రం పిల్లలు ఉండవు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటే.. ఆడ కుక్కకు క్రాసింగ్ చేయించకపోయినా.. గర్భం దాల్చినట్టుగా ఫీల్ అవుతుంది. ఈ పాల్స్ ప్రెగ్నెన్సీలో సంభోగం జరగపోయినా.. కుక్క పెగ్నెన్సీ ఫీల్ అవుతుంది. కొన్ని లక్షణాలను కూడా చూపిస్తుంది. ఫాల్స్ ప్రెగ్నెన్సీని.. ‘ఫాంటమ్ ప్రెగ్నెన్సీ’, ‘సూడో ప్రెగ్నెన్సీ’ అని కూడా అంటారు.
నిపుణులు ఏం అంటున్నారంటే..
ఆడ కుక్క జీవితంలో ఒక్కసారైనా ఈ ఫాల్స్ ప్రెగ్నెన్సీని ఫీల్ అవుతుందట. ఇటీవలి కాలంలో చాలా మంది కుక్కల యజమానులు.. ఫాంటమ్ ప్రెగ్నెన్సీతో జంతు వైద్యుల వద్దకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇది సాధారణ కంప్లైంట్ అయిపోయిందని నిపుణులు అంటున్నారు. ఫాల్స్ పెగ్నెన్సీ సమయంలో కుక్కలు కొన్ని లక్షణాలను చూపిస్తాయి. గర్భం దాల్చాక పోయినా.. ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఇది మెుదటి లక్షణం. ఆడ కుక్క రొమ్ములు కూడా ఉబ్బుతాయట. అంతేకాదు.. రొమ్ముల నుంచి పాలు కూడా కారుతాయి. అయితే కొన్ని కుక్కల్లో ఎక్కువగా మరికొన్నింటిలో తక్కువ పాలు వస్తాయి. కొన్నిసార్లు నీటి లాంటి ద్రవం కూడా కారుతుంది. ఈ సమయంలో డాగ్ తక్కువ ఫుడ్ తింటుంది…పూర్తిగా నిరసిస్తుంది.. కుక్క ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఫీల్ అయ్యే సమయంలో దాని దగ్గరకు వెళ్లకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో అది కాస్త చిరాకుగా, కోపంగా ఉంటుంది. కరిచినా.. కరుస్తుంది. దీని పొట్ట కూడా ఉబ్బినట్లు ఉంటుంది.
ఫాల్స్ ప్రెగ్నెన్సీ సమయంలో మీ కుక్క గోర్లతో నేలపై గీకుతూ ఉంటుంది. ఇంట్లో ఏదో ఓ మూలకు వెళ్లి పడుకుంటుంది. ఈ లక్షణాలు మీ కుక్కలో కనిపిస్తే.. నిర్లక్ష్యం చేయోద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వైద్యుడు మీ ఆడకుక్కకు ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఉందో లేదో చెక్ చేస్తారు.
ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఉండేందుకు కారణాలు ఏంటి..?
కుక్కల్లో ఫాల్స్ ప్రెగ్నెనీ వచ్చేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. హార్మోన్ల ప్రభావం కారణంగా ఇలా జరుగుతుంది. మీ కుక్కకు సరైన సమయంలో క్రాసింగ్ చేయించకపోతే కూడా ఇలానే అవుతుంది.. ఎప్పుడు పడితే.. అప్పుడు క్రాసింగ్ చేయించడం కూడా తప్పే..
చికిత్స ఉంటుందా..?
ఫాల్స్ ప్రెగ్నెన్సీ మీ కుక్క ఫీల్ అయితే.. వెద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. దానికి తగ్గట్టుగా ట్రీట్ మెంట్‌ను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి.. కొన్ని మెడిసిన్ కూడా ఇస్తారు. ఒకవేళ కుక్క ఎక్కువగా ఫాల్స్ ప్రెగ్నెన్సీని ఫీల్ అయితే సర్జరీ కూడా చేస్తారు.. అయితే కొన్ని కుక్కల్లో మెడిసిన్ వాడకుండా కూడా.. తగ్గిపోతుంది. హార్మోన్ల అసమతుల్యతో ఏ ఏజ్ లో అయినా.. కుక్క ఇలాంటి ఫేక్ ప్రెగ్నెన్సీ ఫీల్ అవ్వొచ్చు. మీ కుక్క గర్భంతో ఉన్నాను అనే భ్రమలోనే ఉంటుంది.