కేసీఆర్ ఎయిర్ పోర్టుకు వెళితే బాగుండేది : కోమటిరెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రాగా, ఆ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండడంపై స్పందిస్తూ మాట్లాడారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీని కలవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహమూద్ అలీ, తలసాని వెళితే అక్కడ వారిని పట్టించుకునేదెవరని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .

Komatireddy Venkat Reddy says he won't campaign for Congress in Munugodu

 

ఎన్ని విభేదాలు ఉన్నా గానీ, సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ప్రధానికి స్వాగతం చెబుతే బాగుండేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు మోదీ వెళితే అక్కడి ముఖ్య మంత్రులైన మమతా బెనర్జీ మరియు స్టాలిన్ స్వాగతం చెప్పలేదా అని వ్యాఖ్యానించారు. మన రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా అదే రీతిలో ఎయిర్ పోర్టుకు వెళ్లి మోదీతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకోవాలని వెల్లడించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీ 7 నిమిషాల సమయం ఇచ్చారని, ఆ ఉన్న కొద్ది సమయంలో 70 సమస్యలు ప్రస్తావించవచ్చని వెల్లడించారు. సీఎం అడగకుండా కేంద్రం ఎలా నిధులు ఇస్తుందని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సీఎం రాష్ట్ర సమస్యలపై అడిగితే ఎవరైనా అడ్డుపడతారా? అని ప్రశ్నించారు ఆయన.

 

 

Read more RELATED
Recommended to you

Latest news