ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలంగాణ సర్కార్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఈనెల 12న ముస్లిములకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ముస్లిములు పవిత్ర మాసంగా ఆచరించే రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. రంజన్‌కు రెండ్రోజుల ముందు మాత్రమే ఇచ్చేది.
అయితే ఈసారి పది రోజుల ముందుగానే ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఆయన చేసిన కామెంట్లపై కేసీఆర్ మౌనంగా ఉన్నారు. అయితే ఇఫ్తార్‌ను వేదికగా చేసుకొని విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. హిందూ ముస్లిముల ఐక్యతను చాటుతున్నామని, కానీ కొన్ని పార్టీలు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడనున్నట్లు సమాచారం. అయితే ఇఫ్తార్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యదర్శి భూపాల్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.