రిటైర్మెంట్ ప్రకటించిన యాంకర్ సుమ.. నిజమేనా?

-

బుల్లితెర యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరను ఏలుతున్న ఈమె యాంకర్ గా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక ఒక షో చేస్తోంది అంటే కచ్చితంగా ఆ షో సక్సెస్ అయ్యేవరకు సుమా నిద్రపోరు. అంతలా తన యాంకరింగ్ తో కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఈమె రిటైర్మెంట్ ప్రకటించారు అంటూ ఒక వార్త ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళ్తే యాంకర్ సుమ తాజాగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్టులో గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె యాంకరింగ్ అండ్ యాక్టింగ్ పై ఆసక్తికర కామెంట్లు చేయడం జరిగింది.

1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోయిన్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సుమ.. ఆ తర్వాత నటిగా మంచి బ్రేక్ రాకపోయేసరికి యాంకరింగ్ వైపు అడుగులు వేసింది.. సమయస్ఫూర్తి, వాక్చాతుర్యంతో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడప్పుడు చిన్న పాత్రలు చేస్తూ నటనలోనూ తన కోరికను తీర్చుకుంది అయితే గత ఏడాది చాలా గ్యాప్ తర్వాత పూర్తిస్థాయి రోల్ ప్లే చేసింది సుమ. జయమ్మ పంచాయతీ చిత్రంతో టైటిల్ రోల్ ప్లే చేసిన ఈమె ఈ సినిమాకు నిర్మాత కూడా కానీ అనుకున్నంత స్థాయిలో సినిమా సక్సెస్ అవ్వలేదు.

ఇక తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.. ఈ నేపథ్యంలోని తాజాగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గెస్ట్ గా వెళ్లిన ఆమె విద్యార్థులతో ముచ్చటించారు.. స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. నాకు యాంకరింగ్ అంటేనే ఇష్టం.. యాక్టింగ్ వద్దులే.. అది మనకు కలిసి రాదు అంటూ చెప్పుకొచ్చారు.. ఇక ఈ క్రమంలోని సుమ యాక్టింగ్ కి శాశ్వతంగా గుడ్ బై చెప్పేసారని కొంతమంది భావిస్తున్నారు. అయితే ఆమె యాక్టింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించారు కానీ యాంకరింగ్ కాదు అంటూ స్పష్టం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news