తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్తె నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. తాడిపత్రి అభివృద్ధి చెందిందంటే అది జేసీ కుటుంబ చేసిన అభివృద్ధి అని.. పాలిచ్చే అవును కాదని దున్నపోతును తీసుకు వచ్చారని ఫైర్ అయ్యారు. తాడేపల్లిలో పెద్ద పిల్లి…..తాడిపత్రిలో ఎమ్మెల్యే ఓ చిన్న పిల్లి ఉందని.. తాడిపత్రి పిల్లి ఎవరూ లేనప్పుడు జేసీ ఇంటికి పోయిందని ఆగ్రహించారు.
ధర్మవరంలో నేను వచ్చిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేకి ప్యాంట్ తడిసిపోయిందని.. ఇక్కడ నేను రాక ముందే తాడిపత్రి పిల్లికి తడిసిపోయిందని చురకలు అంటించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపులో ఎమ్మెల్యే కేతిరెడ్డి కోట్లు సంపాదించాడన్నారు. తన పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గానికి వస్తుందని…. జేసీబీలు, ట్రాక్టర్లను ఎమ్మెల్యే దాచిపెట్టారని ఆరోపణలు చేశారు లోకేష్. మట్టిని కూడా వదలడం లేదు ఈ తాడిపత్రి పిల్లి…ప్రజల సొమ్ముతో తాడిపత్రి పిల్లి లగ్జరి కార్లలో తిరుగుతోందని ఆగ్రహించారు నారా లోకేష్.