నీ ఇళ్లు బంగారం కాను అని మనం మాట వరసకు అంటాం.. కానీ మనోడు సీరియస్‌గా తీసుకున్నాడేమో..! హోటల్ మొత్తం బంగారంతోనే కట్టేశాడు. 24క్యారెట్ ప్యూర్ గోల్డ్‌తో 6స్టార్ హోటల్‌గా కట్టించాడు.. అస్సలు నమ్మశక్యంగా లేదు కదా..! ఒక్కరోజు అందులో ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే..
హనోయి గోల్డెన్ లేక్ హోటల్ వియత్నాం రాజధాని హనోయిలో ఉంది. ఇది చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ హోటల్ లోపల, వెలుపల 24 క్యారెట్ల బంగారంతో పూత చేయబడింది. ప్రపంచంలోనే బంగారు పూత పూసిన మొట్టమొదటి హోటల్ ఇదే. 2009లో నిర్మించబడిన ఈ డోల్స్ హనోయి గోల్డెన్ లేక్ హోటల్‌కి వచ్చే అతిథులకు గోల్డ్ కప్పులో కాఫీని అందించారు…ఇక్కడ గిన్నె, గాజు, చెంచా అన్నీ బంగారమే. అయితే ఇప్పుడు హోటల్ మొత్తం బంగారంతోనే తయారైంది.
అలాగే ఇక్కడ స్నానం చేసే స్విమ్మింగ్ పూల్, టెర్రస్, బాత్ టబ్ కూడా బంగారు పూతతోనే ఉంటాయి. అక్కడ టాయిలెట్ సీటు కూడా బంగారు పూతతో తయారు చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఎంత బంగారం ఉందో. గోల్డ్ ఒత్తిడిని తగ్గిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ స్టార్ హోటల్ని పూర్తిగా బంగారంతో తయారు చేశారు నిర్వాహకులు. దాదాపు 54,000 అడుగుల నడక మార్గం, స్విమ్మింగ్ పూల్, గోడలు, నేలపై బంగారు పూతతో కప్పబడి ఉన్నాయి. ఇక్కడ అన్నీ బంగారంతో చేసినవే. ఈ హోటల్ దాదాపు 25 అంతస్తులు ఉంటుంది. ఇందులో మొత్తం 400 గెస్ట్ రూమ్‌లు ఉన్నాయి.
ఈ గోల్డ్ ప్లేటెడ్ స్టార్ హోటల్ అతి ధనవంతుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు విజిట్ చేయడానికి ఆహ్వానిస్తోంది. అందుకే ఇది సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందిందని హోటల్ యాజమాన్యంలోని హోవా బిన్ గ్రూప్ ప్రెసిడెంట్ న్గుయెన్ హు డుయోంగ్ తెలిపారు. ఇంతటి ఖరీదైన హోటల్లో ఒక్క రోజు బస చేయాలంటే రెంట్ ఛార్జీ కూడా అంతే పెద్ద మొత్తంలోనే ఉంది. లగ్జరీ గోల్డ్ హోటల్లో ఒకరోజు స్టే చేయడానికి $250 ఖర్చవుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో సింగిల్ బెడ్రూంకు 20వేలు అవుతుంది. అదే డబుల్ బెడ్ రూమ్ అయితే.. 75,000 వేల వరకూ అవుతుంది.