రాజకీయాలు, పదవులు కొత్త కాదు.. కంటతడి పెట్టిన మంత్రి సబితా

-

 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గత 42 సంవత్సరాలుగా నేను మా ఆయన ఎమ్మెల్యే పదవులను అనుభవించామని, నేను మంత్రిని కావాలనుకుంటే మా ఆయన చనిపోయిన 15 రోజులకే నేను మంత్రిని అయ్యేదానినని, తనకు రాజకీయాలు, పదవులు కొత్త కాదని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో నాకు వడి బియ్యం పోసి నాకు సాగనంపు తారంటా ? భర్త చనిపోయి నోళ్లకు ఎవరైనా వడి బియ్యం పోస్తారా ? అది ప్రతిపక్ష పార్టీల సంస్కారామేనా? అంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు. నువ్వేం చేస్తున్నావ్​… నేనేం చేస్తున్నా ? అంతవరకే మాట్లాడాలే తప్పా దానికి మించి వ్యక్తిగత విమర్శలు చేస్తే , అక్కా చెల్లెలు ఉన్న ఏ మహాను భావుడు దిగజారి మాట్లాడడని, ఇక ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేస్తే ఖబద్దార్​ అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ 15, 16,17,18 డివిజన్​లకు సంబంధించిన బీఆర్​ ఎస్​ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

CBI books Sabita in mining scam | Deccan Herald

అంతకు ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కొంతమంది ఇప్పుడు రాజకీయాల కోసమో, స్వార్ధం కోసమో .. ఇంకేదో అనుకొని అవగాహన లేకుండా వివేకం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆమె మందిప్పడ్డారు. ఇంద్రారెడ్డి చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో చంద్రబాబు ఇంద్రారెడ్డి చనిపోయారు కాబట్టి, నువ్వు మా పార్టీలోకి రావమ్మా … నువ్వు మా పార్టీ నుంచి పోటీ చేయి నిన్ను మంత్రి చేస్తానన్న పట్టించుకోలేదని, నేను ఆరోజు ఆ పార్టీలోకి వెళ్ళ లేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news