యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తండోపతండాలుగా తరలి వచ్చారు. దేవస్థానానికి వివిధ రూపేణా రూ. 69,69,250 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 6,67,600, కైంకర్యముల ద్వారా రూ. 3,600, సుప్రభాతం ద్వారా రూ.10,400, పుష్కరిణీ ద్వారా రూ.1,600, వ్రతాల ద్వారా రూ.1,53,600 ఆదాయం సమకూరిందని వెల్లడించారు.
ప్రచార శాఖ ద్వారా రూ. 24,190, వీఐపీ దర్శనం ద్వారా రూ. 3,00,000, యాదరుషి నిలయము ద్వారా రూ.1,34,334, ప్రసాదవిక్రయం ద్వారా రూ.18,32,700 , పాతగుట్ట ద్వారా రూ. 64,990, కళ్యాణ కట్ట ద్వారా రూ. 1,47,500 ఆలయానికి ఆదాయం వాచినట్టు సమాచారం.
వాహన పూజల ద్వారా రూ. 23,100, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 5,50,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,16,232 ఆదాయం సమకూరిందని తెలిపారు.శివాలయం ద్వారా రూ.10,000, అన్నదానము ద్వారా రూ.17,309, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 5,20,200, క్లాక్ రూమ్ మొబైల్ కౌంటర్ ద్వారా రూ. 41,895, లీగల్, లీజేస్ ద్వారా రూ. 23,50,000 ఆదాయం సమకూరిందని తెలిపారు.