chat GPTకి పోటీగా ఎలాన్ మస్క్ ట్రూత్ GPT

-

ప్రజెంట్ టెక్ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. ఏఐతో మానవాళికి ముప్పు ఉందని ఇప్పటికే పలువురు టెక్ దిగ్గజాలు హెచ్చరించారు. చాట్ జీపీటీ తరహా చాట్​ బాట్​లు పక్షపాతంగా వ్యవహించే ప్రమాదం ఉందని తెలిపారు. ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు టెస్లా దిగ్గజం ఎలాన్ మస్క్ ఏఐ ఆధారిత చాట్ బాట్ ట్రూత్ జీపీటీని తీసుకురానున్నట్లు తెలిపారు.

ట్రూత్‌జీపీటీ పేరిట తాను తీసుకురాబోయే ఏఐ చాట్‌బాట్‌.. ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తుందని ఎలాన్ మస్క్ తెలిపారు. ఇలా మనవాళిని అర్థం చేసుకునే ఏఐ వల్ల ఎలాంటి ముప్పు ఉండదని అన్నారు. చాట్‌జీపీటీకి సరైన పద్ధతిలో శిక్షణనివ్వడం లేదని.. తద్వారా అది పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని ఆరోపించారు.

ఏఐని కచ్చితంగా నియంత్రించాల్సిందేనని ఎలాన్ మస్క్  అభిప్రాయపడ్డారు. మొత్తం మానవాళినే నాశనం చేసే శక్తి ఏఐకి ఉందని హెచ్చరించారు. ఏఐపై మార్క్‌ జుకర్‌బర్గ్‌, బిల్‌గేట్స్‌ వంటి టెక్‌ దిగ్గజాలతో పోలిస్తే మస్క్‌ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news