మంత్రి కిషన్ రెడ్డి పై విమర్శలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే అంబర్ పేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై వారం రోజుల్లో చర్చకు రావాలని తలసాని శ్రీనివాస యాదవ్ సవాల్ చేశారు. అంబర్ పేట నియోజకవర్గానికి కిషన్ రెడ్డి 20 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని… అయినా, ఇంతవరకు నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. కిషన్ రెడ్డితో చర్చకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Talasani challenge to Kishan Reddy

బీజేపీ నేతలు కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా కొనసాగుతోందని అన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరని అన్నారు. యాదాద్రి వంటి గొప్ప ఆలయ నిర్మాణం, అనేక ఆలయాల అభివృద్ధి కేసీఆర్ కే సాధ్యమయిందని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news