చాలా మంది ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగం వలనో లేదంటే కుటుంబ సమస్యల వలనో ఇలా ఏదో ఒక రకంగా ఒత్తిడికి గురవడం సహజమే. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. శారీరకంగా ఎంత బాగున్నా ఒత్తిడి, మానసిక సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఒత్తిడి కి దూరం అవ్వాలన్నా ఒత్తిడి నుంచి బయట పడాలన్నా ఈ చిట్కాలను ప్రయత్నం చేయండి అప్పుడు కచ్చితంగా ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉండడానికి అవుతుంది.
ఒత్తిడితో బాధపడే వ్యక్తి ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేస్తే కచ్చితంగా ఒత్తిడి నుండి దూరం అవ్వచ్చు. కాబట్టి ఒత్తిడితో బాధపడే వాళ్ళు ఉదయం లేచిన వెంటనే ముఖాన్ని కడుక్కోండి. ఒత్తిడి నుండి దూరం అవ్వాలనుకునే వాళ్ళు సూర్యకిరణాలు పడేలా కాసేపు బయట కూర్చోండి. సూర్యకిరణాలు హ్యాపీ హార్మోన్స్ ని బూస్ట్ చేస్తాయి. దీనితో ఒత్తిడి దూరం అవుతుంది ఆనందంగా ఉండొచ్చు.
ఒత్తిడితో బాధపడే వాళ్ళు ఉదయాన్నే త్వరగా లేవడం మంచిది ఉదయాన్నే లేచి పనులు చేసుకుంటే ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఈసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. బ్రీతింగ్ వ్యాయామాలు కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిని చేస్తే ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి నుండి దూరంగా ఉండొచ్చు. మ్యూజిక్ కూడా ఒత్తిడి నుండి మిమ్మల్ని బయట పడేస్తుంది మెడిటేషన్ కూడా ఒత్తిడి నుండి దూరం ఇంకా ఉంచుతుంది ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలు ట్రై చేస్తే ఒత్తిడి లేకుండా ఉండొచ్చు హ్యాపీగా ఉండచ్చు.