తమిళనాడులో దారుణం.. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య..?

-

తమిళనాడులో దారుణం…చోటు చేసుకుంది. ఆసుపత్రుల్లో 300 మంది రోగుల హత్య జరిగినట్లు తెలుస్తోంది. పదేళ్లుగా దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు మోహన్ రాజ్ అనే వ్యక్తి చెప్పిన వీడియో తమిళనాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసినా మోహన్ రాజ్ ను అరెస్టు చేశారు పోలీసులు.

నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్ రాజ్… స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శవాగారంలో వద్ద పని చేస్తున్నాడు. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబసభ్యులు, బందు వుల కోరిక మేరకు సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నట్లు, దీనికి రూ.5 వేలు తీసుకుంటున్నట్లు వీడయోలో మోహన్ రాజ్ తెలిపాడు. చెన్నై, బెంగళూరులో కూడా ఈ తరహా పనులు చేశాడట మోహన్ రాజ్. పోలీసుల దర్యాప్తులో మద్యం మత్తులో తాను అలా మాట్లాడినట్లు తెలిపాడు మోహన్ రాజ్. ఇక మోహన్ రాజ్ పై విషయం పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news