మరాఠా గడ్డపై నేడు మరోసారి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడో సభ ఇది. ఈ సభకు పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. గతంలో నాందేడ్, కాందర్ లోహా సభలతో మహారాష్ట్ర రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించిన బీఆర్ఎస్…ఇప్పుడు ఔరంగబాద్‌లో అడుగు పెడుతోంది. ఔరంగబాద్‌లోని జబిందా మైదానంలో బహిరంగ సభకు పార్టీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి సభకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు.
ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్, భారాస జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ సహా తదితరులు కొంతకాలంగా ఔరంగబాద్‌లోనే ఉండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ కసరత్తు చేశారు.
తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రతోపాటు దేశమంతటా అత్యవసరని బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. మరాఠా ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ప్రచారం చేస్తోంది. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, ఆసరా, కేసీఆర్ కిట్, దళితబంధు వంటివి…. మనకు ఎందుకు వద్దు అంటూ మహారాష్ట్రలో ప్రజలను కదిలిస్తున్నారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది.