TSPSC పేపర్ లీక్​పై నేడు హైకోర్టులో విచారణ

-

TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కేసును సిట్ నుంచి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు బదిలీ చేయాలని కోరుతూ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, తదితరులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది. కేసుకు సంబంధించిన అంశాలపై గతంలో హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించిన ప్రభుత్వం.. ఇవాళ కౌంటరు దాఖలు చేసే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితమే TSPSC కౌంటరు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కాన్ఫిడెన్షియల్ గదిలోని సమాచారం బయటకు వెళ్లిందన్న అనుమానంతో.. బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినట్లు తెలిపింది. ఆ తర్వాత కేసు సిట్‌కు బదిలీ అయిందని.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టుకు వివరించింది. పిటిషన్‌ వేసిన బల్మూరి వెంకట్, తదితరులు కూడా లిఖితపూర్వక వాదనలు సమర్పించారు.

TSPSC సభ్యులు, ఐటీ శాఖలోని కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నందున… వాటన్నింటిపై సిట్ దర్యాప్తు చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. TSPSC ఛైర్మన్‌ను సిట్‌ కార్యాలయానికి పిలకుండా ఆయన వద్దకే వెళ్లి విచారించడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీలపై దర్యాప్తు చేసిన అనుభవం ఉన్న సీబీఐకి దర్యాప్తు అప్పగించాలని పిటిషనర్లు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news