వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. నిరంజన్ రెడ్డి తన పాత ఫోన్ నుంచి చైనా వ్యక్తితో జరిగిన సంభాషణలకు సంబంధించి ఈడీకి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. ఫామ్‌హౌస్ భూమికి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలకు నిరంజన్‌రెడ్డి వివరణపై రఘునందనరావు మాట్లాడారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి సూటిగా కాకుండా అనేక విషయాలను దాటవేశారని రఘునందన్ రావు అన్నారు. చైనా పౌరుడితో నిరంజన్‌రెడ్డి పాత ఫోన్ నుంచి చైనా వాసి ‘మో’తో లావావాదేవీలపై ఈడీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ నిరంజన్‌రెడ్డి దత్తపుత్రుడికి ఎలా దక్కాయని ప్రశ్నించారు. కొనుగోలు చేసిన భూమి హక్కులు దత్తపుత్రుడి నుంచి కుటుంబసభ్యుల పేరుమీదకు ఎందుకు మార్చారని ప్రశ్నించారు.
దత్తపుత్రుడి ఆదాయపన్ను చెల్లింపుపై, చైనా సంబంధాలపై బహిరంగ చర్చకు వస్తానని డేట్ ఫిక్స్ చేస్తే తాను కూడా వస్తానని తెలిపారు. మో కు సంబంధించి లావాదేవీలపై ఈడీకి వివరాలు అందించి దర్యాప్తు చేయమని కోరతానని తెలిపారు. మంత్రి నంబర్ మార్చాల్సిన అవసరం ఏముందని దీనిపై అనేక అనుమానాలున్నాయని అన్నారు.