దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తెలుగు రాష్ట్రాలలో బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారు. అయితే ఆయన మరణానంతరం కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. కాగా తాజాగా ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వైస్సార్ గురించి ఒక కీలక విషయం బయటపెట్టారు. ఈయన చెబుతున్న ప్రకారం చివరగా వైఎస్సార్ కార్యకర్తలతో మాట్లాడుతూ అప్పట్లో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న సమయంలో రాబోయే ఎన్నికల్లో 41 ఎంపీ సీట్ లలో విజయాన్ని సాధించి రాహుల్ గాంధీని పీఎం చేయాలని సంకల్పించారు.
కానీ ఆ తర్వాత జరిగిందంతా మరిచిపోవడమే మేలు అన్నారు, అందుకే ఇప్పుడు వైఎస్ కుటంబంలో వాళ్ళు సీఎం లు అవడం కన్నా రాహుల్ గాంధీ పీఎం అయితేనే వైఎస్సార్ ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పారు కేవీపీ. మరి ఇది జరిగే విషయమేనా అంటే ఏమో చెప్పలేము… గుర్రం ఎగరావచ్చు ?