ఎడిట్ నోట్: ‘వైఎస్’ జగన్ ట్రబుల్స్.!

-

మొన్నటివరకు ప్రతి అంశం రాజకీయంగా జగన్‌కే ప్లస్ అవుతుందనే పరిస్తితి. ఇక రాజకీయంగా జగన్ ఎలాంటి వ్యూహం పన్నిన అది సక్సెస్ అవుతూ వచ్చేది. టి‌డి‌పికి చెక్ పడుతూ వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో ఏంటో కాస్త సీన్ రివర్స్ అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి మొత్తం మారిపోయింది. అనూహ్యంగా టి‌డి‌పి వ్యూహాలు సక్సెస్ అవ్వడం మొదలయ్యాయి.

ఇదే క్రమంలో గత ఎన్నికల్లో జగన్‌కు ఏ వ్యూహాలు అయితే లబ్ది చేకూరయో..ఇప్పుడు అవి రివర్స్ అవుతున్నాయి. ఉదాహరణకు వివేకా హత్య, కోడి కత్తి కేసు..ఈ రెండు కేసులు గత ఎన్నికల్లో జగన్‌కు సానుభూతి తేవడం, ప్లస్ అవ్వడం, చంద్రబాబుకు మైనస్ అవ్వడం జరిగాయి. దీని వల్ల జగన్‌కు ఎన్నికల్లో ఏ మేర లబ్ది చేకూరిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇవే కేసులు ఇప్పుడు ఎలా రివర్స్ అవుతున్నాయి..ఆ కేసుల్లో ఏం జరుగుతుందో అంతా చూస్తున్నారు. ముఖ్యంగా వివేకా మర్డర్ కేసు..గత ఎన్నికల్లో చంద్రబాబు, టి‌డి‌పి నేతలు చేశారని జగన్ ప్రచారం చేసి లబ్ది పొందారు. ఇప్పుడు అదే రివర్స్ అవుతుంది.

ఇందులో నిజనిజాలు ఇప్పుడే బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్ట్ అయ్యారు. ఇక జగన్ మరో బాబాయి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఇదే క్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి సైతం అరెస్ట్ అయ్యే దిశగా వెళుతున్నారు. ఇక అవినాష్ అరెస్ట్ అవ్వకుండా ఎన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలిసిందే. కానీ ఎన్ని జరిగినా తాజాగా సుప్రీం కోర్టు..అవినాష్‌ని అరెస్ట్ చేయవద్దని సి‌బి‌ఐని ఆదేశించలేమని ఇచ్చిన తీర్పుతో సీన్ రివర్స్ అయింది. ఏదేమైనా ఈ విషయం జగన్‌కు బాగా మైనస్ అవుతుంది.

ఇదే క్రమంలో తెలంగాణలో రాజకీయం చేస్తున్న జగన్ సోదరి షర్మిల..పోలీసులని కొట్టారని జైలుకు వెళ్లారు. అనూహ్యంగా ఆమె పోలీసులపై చేయి చేసుకోవడంతో ..పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది..దీంతో ఆమెని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇలా వైఎస్ ఫ్యామిలీ ఇప్పుడు అనూహ్యంగా జైలు పాలవుతుంది. దీంతో జగన్‌కు బిగ్ ట్రబుల్స్ వస్తున్నాయనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news