ఏపీలో యూఏఈ భారీగా పెట్టుబడులు !

-

ఏపీలో యూఏఈ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలోనే,సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై ఈ సందర్భంగా చర్చ నిర్వహించారు. ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం జగన్‌.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు.

సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు సీఎం జగన్‌. దీంతో ఫుడ్‌ పార్క్‌లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్‌ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ కు వివరించారు యూఏఈ రాయబారి. ఏపీని పెట్టుబడులకు లీడ్‌ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news