ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్స్‌లో ఒకటి మెట్ గాలా. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రతి ఏటా ఈ వేడుక జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఫేమస్ తారలంతా ఈ ఈవెంట్లో డిఫరెంట్ ఔట్ఫిట్స్లో సందడి చేస్తున్నారు. ఇండియా నుంచి ఇప్పటి వరకు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, ఈషా అంబానీ వంటి తారలు హాజరయ్యారు.
ఈ ఏడాది కూడా మెట్ గాలా చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుకలో ఈసారి బాలీవుడ్ నుంచి ఆలియా భట్, ప్రముఖ వ్యాపారవేత్త ఈషా అంబానీతోపాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాజరై సందడి చేశారు. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించి దుస్తుల్లో రెడ్‌కార్పెట్‌పై హొయలు పోయారు.
ఆలియా భట్ తెల్లటి స్లీవ్‌లెస్ గౌనులో మెరిసిపోగా.. ఈషా అంబానీ బ్లాక్ డ్రెస్‌లో సందడి చేశారు. ఇక ఈ వేడకలు బాలీవుడ్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి హాజరయ్యారు.