ఐపీఎల్ 2023 : ఆకట్టుకుంటున్న 34 ఏళ్ళ మాజీ ఇండియా ప్లేయర్ !

-

ఈ సంవత్సరం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 16 లో మాజీ ఇండియన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అదరగొడుతున్నాడు. ముంబై ఇండియన్స్ చావ్లా ను వేలంలో కొనుగోలు చేసింది, ఆశ్చర్యకరంగా ప్రస్తుతం ఉన్న ముంబై టీం లో అనుభవం కలిగిన స్పిన్నర్ గా ఉన్నాడు. కాగా ఎటువంటి అంచనాలు లేకపోయినా చావ్లా ఈ టోర్నీలో తనదైన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తున్నాడు. జట్టులో తనకు మించిన స్పిన్నర్ లేకపోవడంతో ఇప్పటి వరకు 9 మ్యాచ్ లు ఆడాడు. ఈ మ్యాచ్ లలో 35 ఓవర్లు వేసిన చావ్లా 15 వికెట్లను పడగొట్టాడు, యావరేజ్ లోనూ షమీ తర్వాత స్థానంలో ఉన్నాడు. ఇక అత్యధిక బౌలర్ల జాబితాలో చావ్లా నాలుగవ స్థానంలో ఉన్నాడు.

ఇక అందరికన్నా ఎక్కువ వికెట్లు తీసిన షమీ 17 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాలలో తుషార్ దేశ్ పాండే (17) మరియు అర్ష్ దీప్ సింగ్ (16) లు ఉన్నారు. ఇదే విధంగా చావ్లా కనుక రాణిస్తే ఈ సీజన్ లో పర్పుల్ క్యాప్ ను అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news