నెల్లూరు జిల్లా రాజకీయాలలో మరొక కీలక మార్పు చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఎల్లప్పుడూ నెల్లూరు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ఇక తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఈ రోజు వైసీపీ లోకి చేరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇక ఈయన ఎమ్మెల్సీగా ఎన్నిక అయినప్పటి నుండి సంచలన నిర్ణయాలతో ముందు వెళుతున్నారు. మాములుగా బొమ్మిరెడ్డి 2019 ఎన్నికలకు ముందు వరకు వైసీపీ లోనే ఉన్నారు. ఇక అప్పట్లో కీలకంగా ఉన్నా జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీ వెంకటగిరి సమన్వయకర్తగా ఉండి ముందుకు నడిపించారు. అయితే ఎన్నికలకు ముందు ఏ కారణం చేతనో టీడీపీలోకి జంప్ అయ్యారు.
ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం.. వైసీపీ పాలనకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్న తీరును చూసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నే ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మళ్ళీ సొంత పార్టీకి చేరారు. మరి ఈరణకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారా ? ఇస్తే ఏ నియోజకవర్గం లాంటి పలు విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.