మీడియా పాలిటిక్స్..జగన్‌-బాబు స్కెచ్.!

-

రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు రాజకీయాలని మీడియానే నడిపిస్తుందా? అనే పరిస్తితి కూడా వచ్చేసింది. అలాగే ఒకప్పుడు మీడియా న్యూట్రల్ గా ఉండేది…ఇప్పుడు రాజకీయ పార్టీలకు భజన చేసే పనిలో ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా సంస్థలు పార్టీల వారీగా విడిపోయిన విషయం తెలిసిందే.

ఇక ఏపీలో అధికార వైసీపీకి భజన చేసే మీడియా ఉంది..అటు ప్రతిపక్ష టి‌డి‌పికి సపోర్ట్ చేసే మీడియా ఉంది..ఆఖరికి జనసేనకు సొంత మీడియా ఉంది. అంటే అలాంటి పరిస్తితి వచ్చేసింది..ఇక వైసీపీ అనుకూల మీడియా..జగన్‌కు భజన చేయడం..చంద్రబాబుని నెగిటివ్ చేయడమే పనిగా పెట్టుకుంది. ఇటు టి‌డి‌పి అనుకూల మీడియా బాబుకు భజన చేయడం..జగన్‌ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుంది. ఇటు జనసేన మీడియా పవన్‌ని పైకి లేపే ప్రయత్నాలు చేస్తుంది. ఇలా ఎవరి మీడియా వారికి భజన చేసే పనిలో ఉంది.

కానీ విచిత్రం ఏంటంటే ఇలా మీడియా మద్ధతు ఉన్నా సరే..ప్రత్యర్ధి మీడియా సంస్థలని టార్గెట్ చేయడం నాయకులు పనిగా మారింది. టి‌డి‌పికు సపోర్ట్ చేసే మీడియాని వైసీపీ గాని, జగన్ గాని ఏ విధంగా టార్గెట్ చేస్తారో చెప్పాల్సిన పని లేదు. అలాగే ఆ మీడియా సంస్థల పేర్లని పదే పదే చెప్పి..తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడుతుంటారు. సరే ప్రత్యర్ధి మీడియాని టార్గెట్ చేయడంలో తప్పు లేదు..కానీ జగన్ తనకు సొంత మీడియా, సపోర్ట్ చేసే మీడియా లేదని చెప్పడమే వింత..ఎందుకంటే వైసీపీకి సపోర్ట్ చేసే మీడియా, సొంత మీడియా ఏదో జనాలకు బాగా తెలుసు.

ఇక జగన్ అలా టి‌డి‌పి మీడియాని టార్గెట్ చేయడంతో ఇప్పుడు చంద్రబాబు కూడా వైసీపీ మీడియాని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల ప్రెస్ మీట్లలో బ్లూ మీడియా అంటూ ఫైర్ అవుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ మీడియాలని ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచుతామని అంటున్నారు.  మొత్తానికి ప్రజల పక్షాన ఉండాల్సిన మీడియా..పార్టీల వైపుకు వెళ్ళి..రాజకీయం నడిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news