బీజేపీలో బాబు టీం వర్సెస్ జగన్ టీం..వారిదే పైచేయి.!

-

దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పరిస్తితి ఏపీలో చాలా దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉంటూ కూడా రాష్ట్రానికి న్యాయం చేయడం లేదనే ఆవేదన ఏపీ ప్రజల్లో ఉంది..అందుకే వారు బి‌జే‌పిపై ఆగ్రహంగా ఉన్నారు. బి‌జే‌పిని ఆదరించడానికి ఇష్టపడటం లేదు. ఇదే సమయంలో ఏపీలో బి‌జే‌పి నేతల రాజకీయం కూడా క్లారిటీ లేకుండా ఉంది. అసలు ఆ పార్టీలో బి‌జే‌పి లైన్ లో పనిచేసే వారి కంటే వైసీపీ, టి‌డి‌పి లైన్ లోనే పనిచేసే వారు ఎక్కువగా ఉన్నారు.

బి‌జే‌పిలో చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వారు కొందరు ఉంటే..జగన్‌కు అనుకూలంగా ఉన్నవారు మరికొందరు ఉన్నారు. అలాగే బి‌జే‌పి లైన్ లో ఉండే వారు కొంతమంది ఉన్నారు. ఇక వారితో ఇబ్బంది లేదు గాని…బి‌జే‌పిలో ఉంటూ వైసీపీ, టి‌డి‌పి లైన్ లో ఉన్నవారితోనే ఇబ్బంది. అయితే మొదట నుంచి బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి. ఇంకా కొందరు నేతలు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే చర్చ నడుస్తుంది.

ఇక కామినేని శ్రీనివాసరావు, సుజనా చౌదరీ, సీఎం రమేశ్, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి..ఇలా కొందరు నేతలు టి‌డి‌పికి అనుకూలంగా ఉన్నారనే చర్చ ఉంది. అయితే వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి పని ఏంటంటే..టి‌డి‌పితో పొత్తు కుదరనివ్వకుండా, జనసేనని కూడా టి‌డి‌పితో కలవనివ్వకుండా ఓట్లు చీల్చి వైసీపీకి లబ్ది చేకూర్చాలనే ప్లాన్. ఇటు టి‌డి‌పికి అనుకూలంగా ఉన్నవారు వచ్చి..టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తుకుని వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు.

అయితే ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చూస్తున్నారు. కానీ అధ్యక్షుడు సోము వీర్రాజు , జి‌వి‌ఎల్ లాంటి వారే పెత్తనమే చెల్లుబాటు అవుతుంది. దీంతో బి‌జే‌పిలో వైసీపీకి అనుకూలంగా ఉన్నవారే హవా ఉంది. అందుకే పొత్తుల గురించి మాట్లాడుతున్న ఆదినారాయణ, విష్ణు కుమార్ రాజులాంటి వారికి అధిష్టానం చేత వార్నింగ్‌లు ఇచ్చేలా చేస్తున్నారు. మొత్తానికి ఏపీ సొంతంగా ఎదిగేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news