ఛాంపియన్స్కి మధ్య సాగిన సంగీత సమరంలో గెలిచింది ఎవరు?

-

సరిగమప ఛాంపియన్షిప్‌‌ ‌‌–¬–గ్రాండ్ ఫినాలే, ఈ ఆదివారం, మే 14న మీ జీ తెలుగులో!

హైదరాబాద్, 9 మే, 2022: జీ తెలుగు పాపులర్ నాన్ ఫిక్షన్ షో సరిగమప, పదిహేనేళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సంగీత ప్రయాణంలో 14వ సీజన్గా ప్రారంభమైన సరిగమప ఛాంపియన్షిప్ తుదిపోరుకు సిద్ధమైంది. ఈ ఆదివారం, మే 14న ప్రసారం కానున్న సరిగమప ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలేలో విజేతలెవరో తేలిపోనుంది. ఛాంపియన్స్ మధ్య జరుగుతున్న ఈ పోరులో టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్న సరిగమప ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ని తప్పక చూడండి, మీ జీ తెలుగులో!

జనవరి నుంచీ ప్రతి వారం తమ ప్రదర్శనలతో అలరిస్తున్న సరిగమప కంటెస్టెంట్స్ ఈ వారం మరిన్ని అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యారు. తుదిపోరులో తలపడేందుకు సిద్ధమైన కంటెస్టెంట్స్, మెంటర్స్ ఎంట్రీతో ప్రారంభమయ్యే ఈ వారం ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ పంచ్లు, ముచ్చటైన ముగ్గురు జడ్జిల కామెంట్స్తో ఈ ఫినాలే ఎపిసోడ్ వినోదం పంచనుంది. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో విజేత ఎవరో ప్రకటించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు మెలొడీ బ్రహ్మ మణిశర్మ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అంతేకాదు ఈ సంగీత ప్రయాణ చివరి అంకంలో ‘అన్నీ మంచి శకునములే’, ‘ఉగ్రం’ చిత్రబృందాలు కూడా పాల్గొని కంటెస్టెంట్స్ని ఉత్సాహపరిచాయి. ఈ ఎపిసోడ్లో కామెడీ హీరో అల్లరి నరేష్ ‘ఇంకీ పింకీ పాంకీ..’ పాటపాడి నవ్వులు పూయించారు. హృదయాలను హత్తుకునే పాటలతో సాగే ఈ సంగ్రామంలో నెగ్గి విజేతగా నిలిచిన సరిగమప ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్ను మణిశర్మ ప్రకటిస్తారు.

హోరాహోరీగా సాగిన సంగీత సమరంలో నాలుగు జట్లు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. వారం వారం సరికొత్త ఛాలెంజ్లు, అద్భుత ప్రదర్శనలతో అలరించిన లిటిల్ ఛాంప్స్, ఛాలెంజర్స్, ఐకాన్స్, సూపర్స్టార్స్ జట్లు తుదిపోరులోనూ ఏమాత్రం తగ్గకుండా పోటీపడ్డాయి. మనసుని తాకే పాటలు, మాటలు, జోకులతో రసవత్తరంగా సాగే సరిగమప ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం మీ జీ తెలుగులో, తప్పక చూడండి!

ఛాంపియన్స్లో ఛాంపియన్ ఎవరో తెలుసుకోవాలంటే.. సరిగమప ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, తప్పక చూడండి, మీ జీ తెలుగులో మాత్రమే!

Read more RELATED
Recommended to you

Latest news